
టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషి వంటి కొన్ని సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ‘సింహాద్రి’ మూవీని ఆయన బర్త్ డే సందర్భంగా 2023 మే 20న విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
సింహాద్రి రీ-రిలీజ్ మొదటి రోజు నుంచే చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టింది కానీ ఆ తరువాతి రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా మొదటి రోజు.. నైజాంలో రూ. 1.06 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 2.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ. 4.01 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. కానీ ఖుషీ రికార్డుకు కాస్త దూరంలో ఆగిపోయింది. సింహాద్రి టోటల్ రీ రిలీజ్‌లో రూ. 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 2 లో నిలిచింది.
మొత్తం కలెక్షన్ల వివరాలు
- నైజాం: రూ.1.15 కోట్లు
- సీడెడ్: రూ. 92 లక్షలు
- యూఏ: రూ. 31 లక్షలు
- తూర్పు గోదావరి : రూ.18 లక్షలు
- పచ్చిమ గోదావరి : రూ. 14 లక్షలు
- గుంటూరు : రూ. 23 లక్షలు
- కృష్ణ: రూ. 24 లక్షలు
- నెల్లూరు: రూ. 13 లక్షలు
- కర్ణాటక: రూ. 26 లక్షలు
- తమిళనాడు : రూ. 11 లక్షలు
- రెస్ట్ ఆఫ్ ఇండియా (ROI): రూ. 15 లక్షలు
- USA: రూ. 49 లక్షలు
- జపాన్: రూ. 11 లక్షలు
- రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ (ROW): రూ. 18 లక్షలు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు: రూ. 4.60 కోట్ల గ్రాస్
సింహాద్రి చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా, ఆయన తండ్రి కె విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎన్టీఆర్ సరసన భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా దొరైస్వామిరాజా నిర్మాతగా వ్యవహరించారు.