యూపీలో జుమ్లా సర్కార్ నడుస్తోంది

యూపీలో జుమ్లా సర్కార్ నడుస్తోంది

యూపీ: ఉత్తర్ ప్రదేశ్లో జుమ్లా సర్కార్ నడుస్తోందని విమర్శించారు శివసేన నేత ఆదిత్య థాక్రే. గురువారం ప్రయాగ్రాజ్లో  నిర్వహించిన శివసేన ప్రచార సభలో పాల్గొన్నఆదిత్య థాక్రే.. యోగి సర్కార్ పై  విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు. యూపీలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోందని, పారిశ్రామిక అభివృద్ధి అసలు కానరావడంలేదన్నారు. యోగి సర్కారుకు ఇవేమీ పట్టవని,  వారి అభివృద్ధి కేవలం ప్రకటనల్లోనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 2017 ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ..  ఇప్పుడు మళ్లీ కొత్త కొత్త హామీల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. యూపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదన్నారు. శివసేన అభ్యర్థలను గెలిపించాలని ప్రజలను కోరారు.

కాగా .. యూపీ అసెంబ్లీకి మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికి 4 విడతలు పూర్తయ్యాయి. మిగతా 3 విడతల ఎన్నికలు వరుసగా ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న జరుగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం:

జగ్గారెడ్డి పార్టీ విడిచిపోరనే అనుకుంటున్నాం

చెలరేగిన ఇషాన్‌, శ్రేయ‌స్‌.. టీమిండియా భారీ స్కోర్‌