గాంధీలో జూనియర్ డాక్టర్ల  ఆందోళన

గాంధీలో జూనియర్ డాక్టర్ల  ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం జూనియర్​డాక్టర్లు నిరసన తెలిపారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా స్టైఫండ్, సూపర్ స్పెషాలిటీ సీనియర్​రెసిడెంట్లకు సరైన గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సీట్ల కేటాయింపులో ఏపీ స్టూడెంట్లకు ఉన్న15 శాతం రిజర్వేషన్​ను తొలగించాలని డిమాండ్​చేశారు. మెడికల్ కాలేజీలు, హాస్టళ్లలోని సౌకర్యాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.