Ntr, Ram Charan: రామ్ చరణ్కు బర్త్డే విషెష్ తెలిపిన ఎన్టీఆర్

Ntr, Ram Charan: రామ్ చరణ్కు బర్త్డే విషెష్ తెలిపిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్ 27 చరణ్ 39వ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ రామ్ చరణ్.. నీకు మరింత సంతోషం, సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ బయట ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సినిమా ఏకంగా ఆస్కార్  అవార్డు ను సైతం అందుకోవడం విశేషం.