సీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్ల ఆందోళన

సీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్ల ఆందోళన
  •    బూతులు తిడుతున్నరు..కాళ్లతో తంతున్నరు
  •   డిచ్​పల్లి  డెంటల్​ కాలేజీలో  సీనియర్లు వేధిస్తున్నారంటూ జూనియర్ల ఆందోళన 

 డిచ్​పల్లి, వెలుగు : నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం బర్దిపూర్ ​శివారులోని తిరుమల ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ డెంటల్ ​సైనెన్స్ ​కాలేజీ లో ర్యాగింగ్​ఉదంతం కలకలం సృష్టించింది. బీ ఫార్మసీ సెకండియర్​ చదువుతున్న తమను థర్డియర్​ అబ్బాయిలు ర్యాగింగ్​ పేరిట వేధిస్తున్నారని గురువారం కాలేజీ లో అమ్మాయిలు ఆందోళన చేశారు. తమను బూతులు తిడుతున్నారని, రాత్రి పూట వాళ్ల రూమ్సకు రావాలని పిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని, చెప్పకపోతే తంతున్నారని చెప్పారు. కాలేజీ కి సంబంధంలేని వాళ్లు కూడా క్యాంపస్​లోకి వస్తున్నారన్నారు. మేనేజ్​మెంట్​కి ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కొంతమంది తల్లిదండ్రులకు విషయం తెలియడంతో అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి స్టూడెంట్స్​ తో పాటు పేరెంట్స్​కు నచ్చజెప్పి పంపించారు. ర్యాగింగ్​ చేస్తున్న నలుగురు స్టూడెంట్స్​ను అదుపులోకి తీసుకున్నారు. గొడవలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కరస్పాండెంట్​ పద్మ తెలిపారు.