
గద్వాల, వెలుగు : కర్నాటక ప్రాజెక్ట్‌ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల ప్రాజెక్ట్ నీటి మట్టం 318.516 మీటర్లకు చేరుకోవడంతో 17 గేట్లను ఓపెన్ చేసి 1,20,938 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,309 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్‌కు 640, రైట్ కెనాల్‌కు 396 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,58,329 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.