జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టుకు వరద మరింత పెరిగింది. దీంతో శుక్రవారం 18 గేట్లు ఓపెన్  చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 318.516 మీటర్ల నీటిని నిల్వ ఉంచుకొని, 18 గేట్ల ద్వారా 1,25,748 క్యూసెక్కులు, విద్యుత్  ఉత్పత్తి ద్వారా 34,149 క్యూసెక్కులతో కలిపి 1,59,544 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.43 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.- గద్వాల, వెలుగు