ప్రీ వెడ్డింగ్ వేడుకలో డ్యాన్స్ చేసిన నటి హన్సిక

ప్రీ వెడ్డింగ్ వేడుకలో డ్యాన్స్ చేసిన నటి హన్సిక

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి హన్సిక మోత్వానీ వివాహానికి అంతా సిద్ధమైంది. రేపు(డిసెంబర్ 4)న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో సోహైల్ కతురియాను వివాహం చేసుకోబోతున్న ఈ నటి.. ప్రీ వెడ్డింగ్ వేడుకలో తన కాబోయే భర్తతో కలిసి డ్యాన్స్ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించిన వీరిద్దరూ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ.. అందర్నీ ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ముంబైకి చెందిన సోహైల్ కతురియా అనే వ్యాపారవేత్త నవంబర్‌లో పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు హన్సిక మోత్వానికి ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అప్పట్లో హన్సిక షేర్ చేస్తూ.. ఇప్పుడు.. ఎప్పటికీ అనే క్యాప్షన్ ను కూడా జోడించింది. ఇక సినిమా విషయానికొస్తే హన్సిక.. హిందీ, తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2001 టెలివిజన్ షో దేస్ మే నిక్లా హోగా చంద్‌తో నటిగా అరంగేట్రం చేసింది.