
జగిత్యాలటౌన్/పెగడపల్లి, వెలుగు: తెల్లారితే సొంతూరికి వెళ్తున్నానన్న ఆనందంలో ఉన్న ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మన రమేశ్ (55) ఏడాది కింద ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాడు.
సొంతూరుకు వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్న రమేశ్ బుధవారం ఫ్లైట్ ఎక్కాల్సి ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. కానీ మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో గమనించిన ఫ్రెండ్స్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తెల్లారితే రమేశ్ ఇంటికి వస్తున్నాడన్న ఆనందంలో ఉన్న అతడి కుటుంబ సభ్యులకు అతడి మరణవార్త తెలియడంతో విషాదంలో మునిగిపోయారు.