పాక్ సుప్రీం కోర్టు జడ్జిగా అయేషా మాలిక్‌

పాక్ సుప్రీం కోర్టు జడ్జిగా అయేషా మాలిక్‌

పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా  న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌ నియమితులయ్యారు. ప్రధాన న్యాయమూర్తి గుల్జార్‌ అహ్మద్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ (JCP)గురువారం ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్‌ అయేషా మాలిక్‌ను ఆమోదించింది. లాహోర్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ అయేషా మాలిక్‌  పాక్  తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.

లింగ సమానత్వం, మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో జస్టిస్‌ ఆయేషా మాలిక్‌ చారిత్రక తీర్పులు ఇచ్చారు.  పాకిస్తాన్‌లో మహిళా హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ తరచూ తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో తొలిసారిగా ఒక మహిళ పాకిస్తాన్‌ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు.

జస్టిస్‌ ఆయేషా మాలిక్‌ లాహోర్‌లోని పాకిస్తాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా(PCL)లో న్యాయశాస్త్రం చదివారు. ఆ తర్వాత లండన్‌లోని హార్వర్డ్‌ లా స్కూల్‌లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. కరాచీలో 1997 నుంచి 2001 వరకు లాయర్ గా  పనిచేశారు. 2012లో లాహోర్‌ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. పాక్ లోని పలు హైకోర్టులు, జిల్లా కోర్టులు, బ్యాంకింగ్‌ కోర్టులు, స్పెషల్‌ ట్రైబ్యునల్స్‌, ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్స్‌లలో సేవలందించారు. ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఉమెన్‌ జడ్జెస్‌ (IAWJ) లోనూ సభ్యురాలిగా ఉన్నారు జస్టిస్‌ ఆయేషా మాలిక్‌.

మరిన్ని వార్తల కోసం..

మోడీ ఘటనలో ఉగ్రవాద హస్తాన్ని తోసిపుచ్చలేం