కానూన్ అప్నా అప్నా మూవీలో జస్టిస్ లావు నాగేశ్వరరావు

కానూన్ అప్నా అప్నా మూవీలో జస్టిస్ లావు నాగేశ్వరరావు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు జూన్ 7న రిటైర్ కానున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి నేతృత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు గౌరవార్థం సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్  విడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జస్టిస్ నాగేశ్వరరావుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాన్ని సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్ వెల్లడించారు. జస్టిస్ నాగేశ్వరరావు కానూన్ అప్నా అప్నా సినిమాలో నటించారని ఆయన తెలిపారు. ఆ సినిమాలో ఆయన పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. 

అయితే యుక్త వయస్సులో ఉనప్పుడు దర్శకుడిగా ఉన్న సోదరుడు నటించమంటే ఒక సినిమాలో నటించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. కోర్టుల్లో వాదనలు వేడెక్కినప్పుడు న్యాయవాదుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించే సమయంలో కొంత నటించాల్సి వస్తుందని ఆయన చమత్కరించారు. ఇక నాగేశ్వరరావు మంచి క్రికెట్ ప్లేయర్ కూడా. ఆయన పలు రంజీ మ్యాచుల్లో కూడా ఆడారు. అదేవిధంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. మద్రాస్ బార్ అసోసియేషన్ కేసు ,పెరారివాలన్ విడుదల,ఎవరికీ బలవంతంగా టీకా ఇవ్వకూడదు, అజంఖాన్ కే వినూత్న పద్ధతిలో బెయిల్ ఎన్నో కీలక తీర్పులనిచ్చారు జస్టిస్ లావు నాగేశ్వరరావు.  

మరిన్ని వార్తల కోసం

మంకీపాక్స్ అంటే ఏమిటీ..ఈ వ్యాధి ఎలా సోకుతోంది..?

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం