లోక్ పాల్ గా పినాకీ చంద్ర ఘోష్ ప్రమాణం

లోక్ పాల్ గా పినాకీ చంద్ర ఘోష్ ప్రమాణం

దేశంలో ఫస్ట్ లోక్ పాల్ గా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్. ఇవాళ ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలి లోక్ పాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్.. రంజన్ గొగోయ్ పాల్గొన్నారు. పీసీ ఘోష్ కు శుభాకాంక్షలు చెప్పారు.

ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌పాల్ నియామక ప్రక్రియ పూర్తిచేయాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడంతో… ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఇటీవల జస్టిస్ ఘోష్‌ను (66)ను ఎంపిక చేసింది. లోక్‌పాల్‌గా నియమితులైన జస్టిస్ ఘోష్‌కు సిట్టింగ్, మాజీ మంత్రులు, ఎంపీలపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించే అధికారం ఉంటుంది. జస్టిస్ ఘోష్ 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.