పసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు

పసుపు రైతులకు 15 వేలు మద్దతు ధర ఇయ్యాలే : జువ్వాడి కృష్ణారావు

మెట్ పల్లి, వెలుగు: పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్​తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి నాలుగున్నర ఏళ్ల తర్వాత.. మళ్లీ ఎలక్షన్లు వస్తున్నాయని బోర్డు పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు.

పసుపు బోర్డు తెచ్చామంటున్న ఎంపీ. .దానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో లీడర్లు కొమిరెడ్డి లింగారెడ్డి, మహేందర్ రెడ్డి, నర్సారెడ్డి, అంజిరెడ్డి, క్రాంతి కుమార్, తిరుపతిరెడ్డి, స్వామిరెడ్డి, బాపురెడ్డి ప్రవీణ్‌‌‌‌, మారుతి బాపూజీ, ఉస్మాన్, చిరంజీవి, శంకర్, రాములు పాల్గొన్నారు.