- 200 మీ. రన్‌లో సిల్వర్ సొంతం
- రిలేలో జ్యోతికశ్రీకి బ్రాంజ్
- 27 మెడల్స్‌తో ఇండియాకు మూడో ప్లేస్
బ్యాంకాక్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి యెర్రాజి జ్యోతి మరో మెడల్స్ గెలిచింది. 100 మీటర్ల హార్డిల్స్‌లో గోల్డ్ నెగ్గిన తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన ఏపీ అమ్మాయి తాజాగా 200 మీటర్ల ఈవెంట్‌లో సిల్వర్ నెగ్గింది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి, షాట్ పుట్టర్ అభా ఖతువా కూడా సిల్వర్ మెడల్స్‌తో మెరిశారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఆరు గోల్డ్, 12 సిల్వర్, 9 బ్రాంజ్‌లతో ఇండియా రికార్డు స్థాయిలో 27 మెడల్స్‌తో మూడో ప్లేస్ సాధించింది. చివరి రోజు ఆదివారం జరిగిన 200 మీ. ఫైనల్లో జ్యోతి 23.13 సెకండ్లతో రెండో ప్లేస్‌తో వెండి ఖాతాలో వేసుకుంది.
విమెన్స్ 4 x400 మీటర్ల రిలేలో ఏపీ అమ్మాయి దండి జ్యోతికశ్రీతో కూడిన ఇండియా టీమ్ 3 నిమిషాల 1.56 సెకండ్లతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ సొంతం చేసుకుంది. 5000 మీటర్ల ఈవెంట్‌లో పారుల్ చౌదరి 15 నిమిషాల 52.35 సెకండ్లతో రెండో ప్లేస్‌తో పోడియం ఫినిష్ చేసి ఈ టోర్నీలో రెండో పతకం సాధించింది. 3000 మీ. స్టీపుల్‌ఛేజ్‌లో ఆమె ఇప్పటికే గోల్డ్ నెగ్గింది. ఇండియాకే చెందిన అంకిత 16 నిమిషాల 3.33 సెకండ్లతో బ్రాంజ్ నెగ్గింది.
ALSO READ :ముఖాన్ని కాల్చి.. ఛిద్రం చేసి... మణిపుర్లో దారుణం
షాట్ పుట్‌లో అభా 18.06 మీటర్లతో సిల్వర్ రాబట్టింది. మెన్స్ జావెలిన్ త్రోలో డీపీ మను 81.01 మీటర్లతో సిల్వర్ గెలవగా, 5000 మీటర్ల రేస్‌లో గుల్వీర్ సింగ్ (13ని. 48.33సె) బ్రాంజ్ నెగ్గాడు. మెన్స్ 800 మీ రేస్‌లో కిషన్ కుమార్ (1 ని. 45.88) , విమెన్స్‌లో కేఎం చందా (2 ని. 01.58 సె) సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్నారు.
