
మణిపుర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు జులై 16న తెలిపారు.వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కెయిబి హేకక్‌మాపాల్ మానింగ్ చింగ్ ప్రాంతంలో నివసిస్తున్న 50 ఏళ్ల మారింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై కాల్చి చంపారు. అనంతరరం ఆమె ముఖాన్ని ఛిద్రం చేశారు. ఇప్పటికే ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తమ అధికారిక ట్విటర్లో తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి రెండు ఆయుధాలు, ఐదు రౌండ్ల మందుగుండు సామగ్రి, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నాగ సామాజిక వర్గానిక చెందిన బాధితురాలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హంతకులకు శిక్ష పడేలా చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల మణిపుర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులే హత్యకు దారి తీశాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.