సీఎం కమల్‌నాథ్‌కు షాక్.. మోడీతో సమావేశమైన సింధియా

సీఎం కమల్‌నాథ్‌కు షాక్.. మోడీతో సమావేశమైన సింధియా

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కమల్ నాథ్ సర్కార్‌కు గట్టి షాకిచ్చారు. 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బెంగుళూరు రిసార్ట్‌లో మకాం వేసిన సింధియా.. ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడుతుంది. దాంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుందోనని యావత్తు దేశం ఎదురుచూస్తోంది. మోడీతో సింధియా భేటీని బట్టి చూస్తే.. సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అనిపిస్తోంది. ఇప్పటికే సింధియా మేనత్త వసుంధర రాజే సింధియా బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె గతంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కాగా.. ఈ నెల 16 నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాల్లో సింధియా తన వర్గ ఎమ్మెల్యేలతో కలిసి కమల్‌నాథ్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు తెలుస్తోంది.

For More News..

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

మారుతీరావు సూసైడ్‌నోట్‌లో ఏముంది?