జ్యోతిర్లింగాల మహాపడిపూజ పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరణ

జ్యోతిర్లింగాల మహాపడిపూజ పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరణ

గట్టుప్పల (చండూరు) వెలుగు: శివ దీక్ష మండల ద్వాదశ జ్యోతిర్లింగాల మహా పడిపూజ, సాక్షి గణపతి విగ్రహ ప్రతిష్టాపన, మహా పడిపూజ పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. గట్టుపల మండలం తెరటుపల్లి గ్రామంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శివదీక్ష గురు స్వామి శ్రీ ఆదిమూల శంకర్ గురుస్వామి, స్వాములతో కలిసి, తెరటుపల్లి గురు స్వామి ఆలయ అర్చకులు వర్కాల అశోక్ స్వామికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

కార్యక్రమంలో స్వాములు మారగొని శ్రీనివాస్ గౌడ్, గుడాల వీరేష్, నకిరేకంటి స్వామి, బండ స్వామి, నరసింహ, గిరి వెంకటేష్, వావిళ్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.