ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : కె.ప్రశాంత్​రెడ్డి

ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : కె.ప్రశాంత్​రెడ్డి

మరికల్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్​రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని తీలేరు మాజీ సర్పంచులు దివంగత వెంకారెడ్డి, వజ్రమ్మ, మాజీ ఎమ్మెల్యే కె వీరారెడ్డి జ్ఞాపకార్థం రూ.10 లక్షలతో గ్రామ స్టేజీ వద్ద నిర్మించిన కమాన్​ను బుధవారం ప్రారంభించారు.

ప్రశాంత్​రెడ్డి దంపతులతో పాటు సర్పంచ్​ రేవతమ్మ పూజలు చేశారు. ఎంపీటీసీ సునీత, తిమ్మారెడ్డి, మల్లయ్య, రాంచంద్రయ్య, రవి, బాల్​రాజ్, వెంకటేశ్, కుర్మన్న, రాము  పాల్గొన్నారు.