మంత్రులు పంపిస్తారా?.. మీ పిల్లలవే ప్రాణాలా?

మంత్రులు  పంపిస్తారా?.. మీ పిల్లలవే ప్రాణాలా?


కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమన్నారు కేఏ పాల్. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశానన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలను పరీక్షలకు పంపుతారా? మంత్రులు తమ పిల్లలను పంపిస్తారా? మీ పిల్లలవే ప్రాణాలా?సామాన్యులవి ప్రాణాలు కాదా అని  ప్రశ్నించారు. కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను తన బిల్డింగ్ లు వాడుకోమ్మని చెప్పానని..అలాగే 1000 బెడ్లు ఇస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాల గురించి ఆలోచించాలన్నారు.ఏపీలోని విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరమన్నారు కేఏ పాల్.

విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడంపై హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకుంటామన్నారు. రెండు నెలలుగా ఎన్నో రాష్ట్రాలు తిరిగాను, ఎందరో ముఖ్యమంత్రులను కలిశానన్నారు. ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్, కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విదేశీ నేతలను కోరానన్నారు.