ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన సూర్య, మోహన్ లాల్

V6 Velugu Posted on Jun 28, 2019

కేవీ ఆనంద్ డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్స్ సూర్య, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ కప్పాన్. ఆర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్న ఈ మెగా ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. దేశ‌భక్తి ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ తెలుగులోను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. శుక్రవారం రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన టైటిల్‌ తో పాటు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. బందోబ‌స్త్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెలుగులో విడుద‌ల కానుంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘కప్పాన్‌’ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మోహ‌న్ లాల్ ప్ర‌ధానమంత్రి పాత్ర పోషిస్తుండ‌గా, సూర్య ఆయ‌న‌కి బాడీ గార్డ్ గా ఉంటాడ‌ట‌. స్టూడియో గ్రీన్‌ బ్యానర్ పై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ సినిమాకి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. సూర్య సరసన సాయేషా సైగ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలినపింది సినిమా యూనిట్.

Tagged kollywood, Mohanlal, Bandobast, Suriya

Latest Videos

Subscribe Now

More News