
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత నిర్వాకం వల్లే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు తన మనసును కలచివేసిందని అన్నారు. అవినీతిపరులతో ఉండలేక పార్టీని వీడానని చెప్పారు.
కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్ము పంపకాల పంచాయతీ జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం ఆరోపించారు. అందుకే ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారని అన్నారు. గత పదేళ్లు ధరణి పేరుతో భూములను కబ్జా చేశారని విమర్శించారు.
►ALSO READ | కాంట్రవర్సీ అయినా పర్వాలేదు.. విద్యాశాఖ నా దగ్గరే ఉండాలనుకున్నా: సీఎం రేవంత్
అధికారం అడ్డుపెట్టుకొని కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణను దోచుకుందని విమర్శలకు దిగారు. కల్వకుంట్ల కుటుంబం గొడవతో తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు.
కాళేశ్వరం అవినీతికి కారణం హరీశ్ రావేనని కవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హరీష్, సంతోష్ రావుల కారణంగానే అవినీతి జరిగిందని ఆరోపించడంతో.. పార్టీ నుంచి స్పెండ్ చేశారు.