
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal agarwal) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ(Satyabhama). ఎమోషనల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. క్షణం, గూఢచారి, మేజర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన శశికిరణ్ తిక్క నిర్మిస్తున్నారు. అందుకే ఈ సీనియా కోసం ఆడియన్స్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కూడా ఉండటంతో సత్యభామ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక హీరోయిన్ కాజల్ కూడా మునుపెన్నడూ లేని విదంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యభామ సినిమా గురించి, తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు.
సత్యభామ సినిమాను నా పర్సనల్ లైఫ్‌తోనూ కనెక్ట్ చేసుకోవచ్చు. నిజ జీవితంలో కూడా ఏదైనా జరిగితే స్పందిస్తూ ఉంటాను. అందరిలా బయటకు వచ్చి ర్యాలీలు చేయకపోవచ్చు కానీ.. ఆ ఘటన గురించి ఆలోచిస్తాను. ఆ సంఘటనలు నన్ను డిస్ట్రబ్ చేస్తూనే ఉంటాయి. నేను ఇప్పటివరకు సత్యభామ లాంటి ఎమోషనల్ మూవీ చేయలేదు. ఈ సినిమా కోసం మొదటిసారి యాక్షన్ కూడా చేశాను. నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలుస్తారు. ఇప్పుడు సత్యభామ అంటున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా పిలిచినా పలుకుతాను.. అని చెప్పుకొచ్చారు కాజల్. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.