ప్యాషన్, కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పటికీ మారవు

ప్యాషన్, కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పటికీ మారవు

సౌత్‌‌ హీరోయిన్స్‌‌లో కాజల్‌‌కి స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటికీ స్టార్ హీరోలందరికీ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఆమె. పెళ్లి చేసుకున్న తర్వాత తన పర్సనల్ లైఫ్‌‌ కోసం నటనకి కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్.. తిరిగి కెమెరా ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ‘ఇండియన్ 2’తో మళ్లీ కెరీర్‌‌‌‌ని కంటిన్యూ చేయబోతోంది. త్వరలో షూట్‌‌లో జాయిన్ కానుంది. ఇప్పటికే రిహార్సల్స్ స్టార్ట్ చేసింది. అయితే ఒకప్పటికీ ఇప్పటికీ తనలో కాస్త మార్పు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘చాలా ఎక్సైటింగ్‌‌గా, ఆతృతగా ఉన్నాను. డెలివరీ అయిన నాలుగు నెలలకి మళ్లీ వర్క్ స్టార్ట్ చేశాను. అయితే ఒకటి గమనించాను. నా శరీరం ఇంతకు ముందులా లేదు. ఎనర్జీ లెవెల్స్‌‌ని పెంచుకోడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. జిమ్‌‌లో గడుపుతున్నాను. హార్స్ రైడింగ్ చేస్తున్నాను. ఇదంతా పెద్ద టాస్క్‌‌లా ఉంది. కానీ ఒకటి. మన శరీరాలు మారొచ్చేమో కానీ మనలోని ప్యాషన్, కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పటికీ మారవు. దేని మీద దృష్టి పెట్టాలనేది మనకి తెలిస్తే చాలు. సాధించలేనిది ఏదీ ఉండదు’ అంది కాజల్. ‘ఇండియన్ 2’లో నటిస్తున్నం దుకు చాలా హ్యాపీగా ఉందని, దాని కోసం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని సంతోషంగా చెబుతోంది. కాజల్‌‌ని మళ్లీ స్క్రీన్‌‌పై చూడబోతున్నామనే సంతోషం ఆమె 
ఫ్యాన్స్‌‌లో కనిపిస్తోంది.