మళ్లీ తల్లి కాబోతున్న కాజల్​!

మళ్లీ తల్లి కాబోతున్న కాజల్​!

సెకండ్​ ఇన్నింగ్స్​లో వరుస అవకాశాలతో కాజల్​ అగర్వాల్​(Kajal Agarwal) జోరుమీదుంది. కమల్​ హాసన్​(Kamal haasan)తో ‘ఇండియన్​ 2(indian2)’, బాలకృష్ణ(Balakrishna)తో  ‘భగవత్​ కేసరి(Bhagavanth kesari)’ వంటి భారీ ప్రాజెక్ట్స్​లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ షాకింగ్​ డెసిషన్​ తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమాలకు కాజల్​ గుడ్​బై చెప్పనుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్​ ఘొల్లుమంటున్నారు. రెండో సారి కాజల్​ తల్లికాబోతుండటమే ఇందుకు కారణమనే బాలీవుడ్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రెండేళ్ల కిందట బిజినెస్​ మ్యాన్​ గౌతమ్​ కిచ్లూ(Goutham kichlu)ని కాజల్​ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. ఈ క్రమంలో కాజల్​ మరోసారి మాతృత్వాన్ని ఆస్వాదించబోతుందనే వార్తలు అటు సోషల్​ మీడియాలోనూ వైరల్​గా మారాయి. తాజాగా ఈ వార్తలను కాజల్​ ఖండిచినట్టు తెలుస్తోంది. తన బిజినెస్​ పనులతో పాటు కుమారుడి బాధ్యతల్లో  బిజీగా ఉన్నందువల్లే సినిమాలకు గ్యాప్​ తీసుకోవాలనుకుంటుదట.