లంగా వోణీ కట్టుకుని కుందనపు బొమ్మలా

లంగా వోణీ కట్టుకుని కుందనపు బొమ్మలా

హీరోయిన్‌‌‌‌గా కెరీర్ ప్రారంభించి దాదాపు పదిహేనేళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ కొత్త హీరోయిన్స్‌‌‌‌కి పోటీనిచ్చేలా తన గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటోంది కాజల్ అగర్వాల్. ఓ వైపు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తోంది. మరోవైపు యువ హీరోలతో పాటు చిరంజీవి, కమల్‌‌ లాంటి సీనియర్ స్టార్స్‌‌‌‌కి కూడా జంటగా నటిస్తోంది. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా 'ఆచార్య' సినిమా నుండి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ని విడుదల చేశారు. తన ఫస్ట్ మూవీ మొదలు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో లంగా వోణీ, చీరకట్టులో మురిపించిన కాజల్.. మరోసారి లంగా వోణీ కట్టుకుని కుందనపు బొమ్మలా మెరిసింది. ‘లాహే లాహే’ పాటలోని స్టిల్ ఇది. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మరోసారి చిరంజీవి సరసన తను నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు మూవీ కోసం నాగార్జునతోనూ జోడీ కట్టింది. నాని నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ చిత్రంలోనూ ఓ హీరోయిన్ గా తన పేరు వినిపిస్తోంది. మరోవైపు తమిళ, హిందీ చిత్రాలతోనూ బిజీగా ఉంది. ఇక పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌ విషయానికొస్తే కిందటేడాది గౌతమ్‌‌‌‌ కిచ్లూని పెళ్లాడింది కాజల్. పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో.. ఇది తనకి మెమొరబుల్ బర్త్‌‌‌‌ డే అంటోంది ఆనందంగా.