కాకా.. అందరివాడు : కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్​ చైర్మన్ వివేక్ వెంకట స్వామి

కాకా.. అందరివాడు : కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్​ చైర్మన్  వివేక్ వెంకట స్వామి
  • కాలేజీలో ఘనంగా వెంకట స్వామి జయంతి వేడుకలు

ముషీరాబాద్, వెలుగు : కాకా వెంకటస్వామి 94వ జయంతి వేడుకలను గురువారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. చీఫ్​గెస్టుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి, సెక్రటరీ గడ్డం వినోద్, కరస్పాండెంట్ సరోజా వివేక్, విశాక జేఎండీ వంశీకృష్ణ, కుటుంబసభ్యులు రోషిణి, వైష్ణవి, గడ్డం వెంకట్ తదితరులు హాజరై కాకా విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. వివేక్ వెంకటస్వామి.. మాట్లాడుతూ.. మంచి విద్యను అందించడంలో అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అనంతరం స్టూడెంట్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాకా విద్యార్థి దశ నుంచి మొదలుకొని ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని స్కిట్​ ద్వారా స్టూడెంట్లు  చేసి చూపించారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు సర్టిఫికెట్లు మెమోంటోలను అందజేశారు. ఎన్​సీసీ, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్లు చేసిన అన్నదానం స్ఫూర్తిని నింపింది. కార్యక్రమంలో ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

ఓయూలో కాకాకు ఘన నివాళి

సికింద్రాబాద్ : కాకా వెంకటస్వామి జయంతిని ఓయూలో ఘనంగా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద కాకా ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కాకా పాత్ర మరువలేనిదన్నారు. ఆయన జయంతిని  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు.