
హసన్ పర్తి, వెలుగు : ఈ నెల 19, 20, 21 తేదీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియం ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే “తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ 2025” ఏర్పాట్ల పై వైస్ ఛాన్సలర్ కె.ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం సమీక్ష నిర్వహించారు. అతిథులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వర్షాలను పరిగణలోకి తీసుకుని తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
వివిధ సెషన్లకు అనుగుణంగా విశ్వవిద్యాలయ క్యాంపస్ లోని సెమినార్ హాళ్లను ఆధునిక సాంకేతిక పరికరాలతో సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు పూర్తిస్థాయిలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామరెడ్డి, పి.మల్లారెడ్డి, ఎన్.ప్రసాద్, డాక్టర్ ఎం.స్వర్ణలత, డాక్టర్ డి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.