తాటికొండ.. అవినీతి అనకొండ

తాటికొండ.. అవినీతి అనకొండ

 

  • కేయూలో వీసీ రమేశ్ దిష్టిబొమ్మ దహనం

  • డప్పు సప్పుడు,- చెప్పులతో నిరసన 

వరంగల్ :  మూడేండ్ల పాలనలో వర్సిటీని వీసీ తాటికొండ రమేశ్​ సర్వనాశనం చేశారని  విద్యార్థి సంఘాల లీడర్లు ఆరోపించారు. ఇవాళ్టితో వీసీ పదవీ కాలం ముగియడంతో కాకతీయ యూనివర్సిటీలో  వీసీ రమేశ్​ దిష్టిబొమ్మతో శవయాత్ర  నిర్వహించారు.  ‘తాటికొండ.. అవినీతి అనకొండ’ అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు.  డప్పు సప్పుడు, చెప్పులతో నిరసన వ్యక్తం చేశారు. కేయూ లైబ్రరీ నుంచి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.  ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మూడేండ్ల పాలనలో వర్సిటీని సర్వనాశనం చేశారని వీసీపై ఫైర్​ అయ్యారు. నేటితో పీడ విరగడైందంటూ నినాదాలు చేశారు.