
బోధన్,వెలుగు: రైతులు వరి కోనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్దుర్కి సొసైటీ సెక్రటరి ఈర్వంత్ సూచించారు. మంగళవారం బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో వరికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఏగ్రేడ్ ధాన్యానికి రూ.2203, బీగ్రేడ్ ధాన్యానికి రూ.2183 ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. సోసైటీ పరిధిలోని కల్దుర్కి, రాంపూర్, సిద్దాపూర్, ఖండ్గావ్, బిక్నెల్లి, ఖండ్గావ్, కొప్పర్గ గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈవో సాయిలు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గోన్నారు.