ప్రభాస్ మానియా: కల్కి సినిమా టికెట్ 2 వేల 300 రూపాయలా..!

ప్రభాస్ మానియా: కల్కి సినిమా టికెట్ 2 వేల 300 రూపాయలా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD  రిలీజ్ కు ముందే భాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది.  జూన్ 27వ తేదీ గురువారం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కల్కి మానియా నడుస్తోంది. ఇప్పటి ఈ మూవీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మొదటి రోజు టికెట్స్ మొత్తం సోల్డ్ అయ్యాయి. 

దేశవ్యాప్తంగా ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో టికెట్ ధరలు భారీగా పెంచేశారు. ముంబయిలో అయితే.. టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబయలోని మైసన్ INOX: BKCలోని జియో వరల్డ్ ప్లాజాలో ఒక్కో టికెట్ రూ.2 వేల 300కి అమ్ముతున్నారు.  INOX: వర్లీలోని అట్రియా మాల్‌లోని ఇన్ సిగ్నియా,  PVR ICON:  ఫీనిక్స్ పల్లాడియం, లోయర్ పరేల్ లలో ఒక్కో టికెట్ ను రూ.17 వందల 60, రూ.15 వందల 60 లకు అమ్ముతున్నారు.  చాలా నగరాల్లో కల్కి మూవీ టికెట్ ధరలు రూ.100 నుండి రూ.11వందలకు అమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్మాణ సంస్థ భారీగా టికెట్స్ ధరలను పెంచేసింది. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చాయి. ఇక, నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది.  ఏకంగా $4  మిలియన్స్ ప్రీ సేల్ బిజినెస్ జరిగిందని సినీ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. ఈ మూవీ ప్రీమియర్స్ కు కూడా లక్ష టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ సాధింస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.