ఆదిపురుష్ ఎఫెక్ట్.. క్రాస్ చెక్కింగ్లో కల్కి 2898 AD టీమ్

ఆదిపురుష్ ఎఫెక్ట్.. క్రాస్ చెక్కింగ్లో కల్కి 2898 AD టీమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు  కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా నటిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా కోసం దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేకర్స్.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో మూవీ టీం ఆ ఫస్ట్ లుక్ స్థానంలో మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు యూనిట్. ఆ తరువాత రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

అయితే ఇక ముందు కల్కి సినిమా నుండి వచ్చే అప్డేట్ లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా VFX విషయంలో క్రాస్ చెక్ చేస్తున్నారట. దానికన్నా ముందు టీజర్ విషయంలో ఆడియన్స్ నుండి వచ్చిన రివ్యూస్ అన్నిటిని మూవీ టీం పరిశీలిస్తున్నారట. వాటి ఆధారంగా  VFX ని మరింతగా మెరుగుపరిచేందుకు వర్క్ చేస్తున్నారట. ఈ రివ్యూస్ అన్నిటిని స్వయంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పరిశీలిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ప్రియాంక దత్ సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ తో పంచుకుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ తమ స్టైల్లో కామెంట్స్ పడుతున్నారు. ఆదిపురుష్ ఎఫెక్ట్ ఆమాత్రం ఉంటుందిలే.. అందుకేగా ఈ రివ్యూలనీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.