Kalki 2898 AD: ఇటలీలో ఆటాపాటా షురూ..ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్

 Kalki 2898 AD: ఇటలీలో ఆటాపాటా షురూ..ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD). టాలీవుడ్లో క్రియేటీవ్ డైరెక్టర్గా పేరుతెచ్చుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో కల్కి పాటల నగారా మోగించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

లేటెస్ట్గా ప్రభాస్ ఫ్యాన్స్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. రీసెంట్గా ఇండియాలో పలు కీలక షెడ్యూల్స్ను కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం తాజాగా ఇటలీకి బయల్దేరుతున్నట్లు ఫోటో రిలీజ్ చేశారు. ఇటలీలో ఆటాపాటా మొదలు..అంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. మరి ఈ ఫొటోలో ప్రభాస్ అయితే ఉన్నాడు..దీపికా మాత్రం లేదేంటి? అనుకుంటున్నారా..కుర్రాళ్లకు మత్తెక్కించే దిశా(Disha Patani)ఉందిగా.

సో..ప్రభాస్ అన్న..దిశా తోనే చిందేయబోతున్నాడు అన్నమాట. తా టక్కరా టక్క టక్కరా బీట్కు హీరో ప్రభాస్ రీసెంట్గా చిందేసే వీడియో కూడా పోస్ట్ చేశారు. మరి ఈ బీట్ తోనే సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.ఈ ఫొటోలో ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా తో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఉన్నారు.

బాహుబలి-1,బాహుబలి-2, సలార్,రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ మాస్ డ్యాన్స్ను చాలా వరకు ఫ్యాన్స్ మిస్ అయ్యారు.ఇక త్వరలో కల్కి ఫస్ట్ సింగిల్ తో ఫ్యాన్స్ కోరిక తీరనుంది. నిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కల్కి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిన డైరెక్టర్ నాగ్..సాంగ్స్ తో ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నాడో తెలియాల్సి ఉంది. అలాగే కల్కి ట్రైలర్ ఏప్రిల్ 9న వచ్చే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో రాబోతుంది.