
హైదరాబాద్, వెలుగు: ఒకేషనల్ వేర్ బ్రాండ్కల్కి ఫ్యాషన్‌లో లైట్‌హౌస్ ఫండ్స్ పెట్టుబడి పెట్టింది. ఈ డబ్బుతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో స్టోర్లు ఏర్పాటు చేస్తామని కల్కి ప్రకటించింది. సరఫరా గొలుసు, ఉత్పత్తి సామర్థ్యాలను కూడా బలోపేతం చేస్తామని తెలిపింది. హైదరాబాద్‌సహా ఎనిమిది సిటీల్లో కల్కికి స్టోర్లు ఉన్నాయి. వీటిలో ట్రయల్సర్వీసులు, స్కిల్డ్స్టైలిస్టులు, ఫిట్టింగ్, ఆల్ట్రేషన్, వర్చువల్కన్సల్టేషన్స్ వంటి సదుపాయాలు ఉన్నాయని కల్కి తెలిపింది.