ఇండియన్2 పై కమల్ ఫోకస్

ఇండియన్2 పై కమల్  ఫోకస్

ఈ ఏడాది ‘విక్రమ్’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న కమల్ హాసన్.. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో ‘ఇండియన్2’ ఒకటి. శంకర్  రూపొందిస్తున్న ఈ చిత్రానికి మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ పడింది. సమస్యలన్నీ పరిష్కరించుకుని ఇటీవల తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. దీంతో ఓ వైపు రామ్  చరణ్‌‌‌‌తో సినిమా చేస్తూనే, మరోవైపు కమల్‌‌‌‌ మూవీని రీ స్టార్ట్ చేశాడు శంకర్. ప్రస్తుతం చరణ్‌‌‌‌తో న్యూజిలాండ్‌‌‌‌లో ఓ సాంగ్ షూట్ చేస్తున్న శంకర్ టీమ్, ఈ నెలాఖరుకి చెన్నై చేరుకోనున్నారట. డిసెంబర్ 5 నుంచి ‘ఇండియన్2’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్.  

ఇప్పటికే డెబ్భై శాతం షూటింగ్‌‌‌‌ పూర్తయిన ఈ మూవీపై కమల్ కంప్లీట్ ఫోకస్ పెట్టారట. మార్చి ఎండింగ్‌కు మొత్తం షూట్ కంప్లీట్  చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.  కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌‌‌‌సింగ్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తోంది. అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది అక్టోబర్ 14న రిలీజ్ చేయనున్నారు. ఇరవై ఆరేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలో ‘ఇండియన్’ మూవీకి సీక్వెల్‌‌‌‌గా రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!