ఇది అస్సలు ఊహించలేదు.. ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చిన కమల్

ఇది అస్సలు ఊహించలేదు.. ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చిన కమల్

విక్రమ్(Vikram) సినిమా సక్సెస్ తరువాత వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్(kamal Haasan). ప్రస్తుతం ఆయన తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తో ఇండియన్2(Indian2) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 1996లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచినా భారతీయుడు(Bharateeyudu) సినిమాకు ఇది సీక్వల్. కంబ్యాక్ ఇండియన్ అనే స్లోగన్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఉండటంతో.. ఆ అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. 

ఈ సినిమా తరువాత కమల్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో తగ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్రిష, జయం రవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అనంతరం దర్శకుడు హెచ్ వినోద్ తో కూడా ఒక యాక్షన్ మూవీ చేయనున్నాడు కమల్ హాసన్. ఈ సినిమా షూటింఫ్ త్వరలోనే మొదలుకానుంది.

ఈ సినిమాలే కాకుండా.. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఐడియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కల్కి 2898 ADలో కూడా కీ రోల్ చేస్తున్నారు కమల్ హాసన్. పాన్ వరల్డ్ లెవల్లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ నెగిటీవ్ రోల్ లో కనిపిస్తారని టాక్. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న కమల్.. మరి క్రేజీ ప్రాజెక్టు ను అనౌన్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కమల్ కెరీర్ లో 237వ సినిమాగా వస్తున్న ఈ మూవీకి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బరివ్ మాస్టర్స్ దర్శకత్వం వహించనున్నారు. ఇది చూసిన కమల్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. అంతేకాదు.. ఇన్ని సినిమాల మధ్య ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే కన్ఫ్యూజన్ లో పడిపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.