
తమిళ అగ్ర దర్శకుడు శంకర్ (Shankar),తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 (Indian 2).1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు (Bharateeyudu)సినిమాకు సీక్వెల్ గా శుక్రవారం (జూలై 12న) వరల్డ్ వైడ్ గా రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లంచగొండి తనాన్ని ఇక ఉపేక్షించేది లేదు అంటూ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా థియేటర్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంపై ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.
ఇండియన్ 2 మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే, ఆగష్టు 9న తమిళం సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఆగష్టు 9న స్ట్రీమింగ్ చేసే విషయంలో ట్వీస్ట్ మొదలైంది.
అదేంటంటే..ఇండియన్ 2 మూవీ థియేటర్ రిలీజ్ కు ముందే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్టు సమాచారం. సుమారు రూ.120 కోట్ల భారీ రేటుకు దక్కించుకునేలా డీల్ చేసుకుందని అప్పట్లో టాక్ బయటికి వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్ట్రీమింగ్ కి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారట. కానీ, ఇప్పుడు ఇండియన్ 2 థియేటర్స్ ఆడియన్స్ను డిస్సపాయింట్ చేయడంతో స్ట్రీమింగ్ రేటును సగానికి తగ్గించినట్లు టాక్ వస్తోంది. ముందు మాట్లాడుకున్నంత మొత్తం అమౌంట్ను చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఇండియన్ 2 నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌తో నెట్‍ఫ్లిక్స్ మళ్లీ చర్చలు చేస్తోందని సినీ సర్కిల్లో సమాచారం.
కాగా ఈ సినిమాకి సుమారు రూ.250కోట్ల భారీ బడ్జెట్‍తో తెరకెక్కించగా మొత్తంగా రూ.140కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. త్వరలో ఓటీటీ రిలీజ్ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.