ఇండియన్‌‌‌‌‌‌‌‌ 2 షూటింగ్ కంప్లీట్

ఇండియన్‌‌‌‌‌‌‌‌ 2  షూటింగ్ కంప్లీట్

విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్.. గత కొద్ది నెలలుగా తన ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ ‘ఇండియన్‌‌‌‌‌‌‌‌ 2’పై పెట్టారు. ఆరేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎన్నో సమస్యలను అధిగమించి ఎట్టకేలకు షూటింగ్ పూర్తయింది. చెన్నైలో జరిగిన తాజా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌తో షూటింగ్‌‌‌‌‌‌‌‌ మొత్తం పూర్తయినట్టు దర్శకుడు శంకర్ ప్రకటించారు. టీమ్ అందరితో కలిసి కమల్ హాసన్ దిగిన ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశారు. 

కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌‌‌‌‌‌‌‌, బ్రహ్మానందం, స‌‌‌‌‌‌‌‌ముద్రఖని, మధుబాల, ప్రియా భవానీ శంకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక హెచ్‌‌‌‌‌‌‌‌.వినోద్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో కమల్ హాసన్ నటించాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లో కమల్ కొన్ని మార్పులు చెప్పిన కారణంగా ఆ సినిమా ఆలస్యమయ్యేలా ఉంది.

ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మణిరత్నం సినిమా షూటింగ్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నారట కమల్. నిజానికి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి షూటింగ్ అనుకున్నప్పటికీ.. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభాస్‌‌‌‌‌‌‌‌ హీరోగా నాగ్ అశ్విన్ తీస్తున్న ‘కల్కి 2898 ఏడి’లో కమల్ కీలకపాత్ర పోషిస్తున్నారు.