
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మూవీ వస్తుందంటే తమిళంలోపాటు తెలుగులోనూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం కమల్ నటిస్తోన్న 232వ సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న ఈ మూవీలో కమల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్టు అనౌన్స్ చేసిన మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ‘విక్రమ్’ షూట్ పూర్తయిన సందర్భంగా టీమ్ అంతా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందంటున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఇదో యాక్షన్ డ్రామా. ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌లో సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్‌గా తమిళ బిగ్‌బాస్ షోనుంచి తప్పుకున్న కమల్ ఇకపై తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంటుందని చెప్పారు.