సామాజిక అంశంతో కమల్ హాసన్ నెక్ట్స్ మూవీ

సామాజిక అంశంతో కమల్ హాసన్  నెక్ట్స్ మూవీ

కమల్ హాసన్(Kamal Haasan)  వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇండియన్ 2 షూటింగ్ తో పాటు, ప్రాజెక్ట్-K లో కూడా నటిస్తున్నారు. గతంలో డైరెక్టర్  హెచ్ వినోద్(H. Vinoth)  తో ఓ మూవీ ప్లాన్ చేసిన, ఆగిపోతూ వస్తుంది. తాజా కథనాల ప్రకారం హెచ్ వినోద్ తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఒక మంచి సందేశాత్మక కథను కమల్ హాసన్ కోసం రెడీ చేసినట్లు టాక్. దేశంలో వ్యవసాయం పతనావస్థ.. రైతుల బాధలు ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. 

ఇది వరకు కమల్ హాసన్ స్వయంగా NDA ప్రభుత్వ తీరుపై వ్యతిరేఖం తెలపటం తెలిసేందే. రైతుల విషయంలో ఎప్పుడు మద్దతు తెలిపే కమల్..ఇప్పుడు ఏకంగా అలాంటి కథతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావించే హెచ్ వినోద్ ఈ సారి కమల్ తో భారీ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట. 

ఇక విజయ్ సేతుపతి(Vijay Sethupathi)-, యోగి బాబు(Yogi Babu)  కూడా ఈ మూవీలో నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ మూవీతో కమల్ హాసన్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.