కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్..బీజేపీలో చేరడం ఖాయమా?

కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్..బీజేపీలో చేరడం ఖాయమా?

మిలింద్ దేవరా, అశోక్ చవాన్ వంటి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇటీవల పార్టీని వీడిన క్రమంలో కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందు కున్నాయి. కమల్ నాథ్.. కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవజ్ణుడైన నేత.. దశాబ్దాలుగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. అటువంటి సీనియర్ నేత బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ శనివారం మధ్యాహ్నం (ఫిబ్రవరి 17) ఢిల్లీ వెల్లడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు కమల్ నాథ్ కుమారుడు  లోక్ సభ సభ్యుడు నకుల్ నాత్ X ఫ్రొఫైల్ నుంచి కాంగ్రెస్ గుర్తును తొలగించడం కూడా ఊహగానాలకు బలం చేకూరుస్తున్నాయి. కీలకమైన లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీని వీడుతున్న నేతలతో ఇప్పటికే గందరగోళంలో ఉన్న కాంగ్రెస్ కు కమల్ నాథ్ పార్టీ మారడం గట్ట దెబ్బే.

కమల్ నాథ్ రాజకీయ జీవితం 

1946లో జన్మించిన కమల్ నాథ్ మధ్యప్రదేశ్ కు 18వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మంత్రి మండలిలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న కమల్ నాథ్ మధ్య ప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ నియోజకవర్గం నుంచి తొమ్మిది సార్లు ఎన్నికయ్యారు. లోక్ సభలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఒకరిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 

కమల్ నాథ్ తన కేరీర్ లో పట్టణాభివృద్ది, వాణిజ్యం, పరిశ్రమల మంత్రితో పాటు కీలక మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.ఆర్థిక, మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. పర్యావరణం, వస్త్రాలు, పట్టణాభివృద్ధిలో చొరవ చూపారు. నెహ్రా -గాంధీ కుటుంబంతో కమల్ నాథ్ మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఇందిరాగాంధీకి మూడో కొడుకు అనే కమల్ నాథ్ కు పేరుంది.ఇది గాందీ కుటుంబంతో కమల్ నాథ్ పంచుకున్న సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. 

పార్టీలో కమల్ నాథ్ ప్రాబల్యం తగ్గిందా?

అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో  కాంగ్రెస్ పార్టీలో కమల్ నాథ్ ప్రాబల్యం తగ్గిందని టాక్.. కమల్ నాథ్ అతి విశ్వాసం.. ప్రచారంలో లేని ప్రచార ప్రయత్నాలు, అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం, అంతర్గ విభేదాలతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికల్లో తమ ఓటమికి కారణమని స్థానిక పార్టీ నేతలు విమర్శించడం.. అప్పటినుంచి పార్టీలో కమల్ నాథ్ ప్రాబల్యం తగ్గుతూ వచ్చిందని తెలుస్తోంది. కమల్ నాథ్ లో ఎలాంటి చర్చలు లేకుండానే ఎంపీసీసీ ప్రెసిడెంట్ గా జితూ పట్వారీని అధిష్టానం నియమంచడంతోనే అతన్ని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.