
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : ‘భూభారతి’ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ సమస్యలపై 4,225 అప్లికేషన్లు వచ్చాయని, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం రాష్ర్ట రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్‌మిట్టల్ భూభారతి రెవెన్యూ సదస్సులు, నీట్ పరీక్ష, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్‌నాయక్, ఆర్డీవో ప్రభాకర్, హౌజింగ్ పీడీ జయపాల్‌రెడ్డి, ‘భూభారతి’ స్పెషల్ ఆఫీసర్ రాజేందర్, లింగంపేట తహసీల్దార్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
సెక్రటరీలకు రెండు రోజుల ట్రైనింగ్
పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చే ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం, గ్రామసభ నిర్వహణ తదితర ఆంశాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాలు పక్కగా అమలయ్యేలా చూడాలన్నారు. పలు అంశాలపై రిసోర్స్ పర్సన్లు వివరించారు. అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డీపీవో మురళీ, డీఎల్పీవో శ్రీనివాస్, ట్రైనింగ్ అధికారులు రాజేందర్, సవిత, కిషన్ తదితరుల పాల్గొన్నారు.