ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్​ ఆశిస్​ సంగ్వాన్​సూచించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో  సెంట్రింగ్​ యూనిట్​ వర్క్​ కోసం లబ్ధిదారులకు ట్రైనింగ్​ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 32 మందికి సోమవారం కలెక్టర్ సర్టిఫికెట్లు అందించారు.

 అనంతరం మాట్లాడుతూ..  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్​ అయ్యేందుకు  సెంట్రింగ్​ సేవలు అత్యంత అవసరమన్నారు. సెంట్రింగ్ యూనిట్ల స్థాపనలకు  లబ్ధిదారులకు  సబ్సీడితో  పాటు, బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించాలని అధికారులకు సూచించారు. డీఆర్​డీవో సురేందర్, అడిషనల్ డీఆర్​డీవో విజయలక్ష్మి,  డీపీఎం సాయిలు,  ఏపీఎం రాజేందర్​ పాల్గొన్నారు.