కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రం హౌజింగ్ బోర్డు సమీపంలోని హిందూ శ్మశానవాటికలో లైటింగ్ లేక ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియల కోసం ఆదివారం రాత్రి శవాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. కరెంట్ లైన్లు ఉన్నప్పటికీ వైర్లు తెగిపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వాటిని తిరిగి మున్సిపల్ అధికారులు సరిజేయించకపోవటంతో శ్మశాన వాటికలో చీకటి అలుముకుంది.
దీంతో అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మృతుని బందువులు, కుటుంబ సభ్యులు తమ వెంట ఉన్న సెల్ఫోన్ల లైట్లు, శవాన్ని తీసుకెళ్లిన రథానికి ఉన్న లైట్ల సాయంతోనే అంత్యక్రియలు చేశారు.
