
అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం నీట మునిగింది. రాత్రి నుంచి ( August 27th) కుంభవృష్టి కురుస్తోంది. ఇవాళ కూడా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట తెగిపోవడంతో సుమారు 300 ఎకరాలు పంట నీట మునిగింది...రెండు పంట లకు సరిపడే నీటి సామర్థ్యం కలిగిన ఈ చెరువు గండిపడటంతో గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read : 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు రోడ్డున పడ్డారు. పలు ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలకు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. భారీ వర్షాలకు పలు చోట్ల కట్టలు తెగడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సమీపంలోని పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. . జిల్లాలోని రాజంపేట, బిక్నూర్, కామారెడ్డి,పాల్వంచ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అత్యంత భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. చరిత్రలో ఎప్పుడు లేనంతగా వర్షపాతం నమోదైంది.