మున్సిపల్ కార్యాలయం వద్ద కామారెడ్డి రైతుల ఆందోళన

మున్సిపల్ కార్యాలయం వద్ద కామారెడ్డి రైతుల ఆందోళన

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో వందల మంది పోలీసులు చేరి, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కొందరు బీజేపీ నాయకుల అరెస్ట్ చేసిన పోలీసులు.. కలెక్టరేట్ వద్ద జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పోలీసుల ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కామారెడ్డి కొత్త టౌన్ ప్లానింగ్ పై  గత కొన్ని రోజులు రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్లాన్​కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, ప్లాన్​ మార్చాలని డిమాండ్​ చేస్తూ  రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 1,026 అభ్యంతరాలు వచ్చాయి. ఇంకా కూడా వచ్చే అవకాశముంది. ప్లాన్​లో ప్రతిపాదించిన ఇండస్ర్టియల్ జోన్​, గ్రీన్ ​జోన్​, 100 ఫీట్ల పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మున్సిపాల్టీతోపాటు, కలెక్టర్​కు అభ్యంతరాలు ఇచ్చారు.