- ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు: సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి www. తెలంగాణ వర్కింగ్‌జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే-ఐజేయూ) కామారెడ్డి జిల్లా 3వ మహాసభలు శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. సభలకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని, ప్రభుత్వం ఇవ్వకపోతే తన సొంత ఫండ్స్‌తో స్థలాలు కొనుగోలు చేసి ఇస్తానన్నారు.
సంఘం స్టేట్ప్రెసిడెంట్ విరాహత్అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టుల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ల జారీలో నిబంధనలు సరళీకృతం చేయాలన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు రజనీకాంత్, తోట రాజేశ్, ప్రతినిధులు లతీఫ్, ముదాం వెంకటి, యు.బాలయ్య, శ్రీనివాస్, బాలప్రకాశ్, సురేశ్, వ్యాపారవేత్త టి.సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
