కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్

కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్

అధికార బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి నియోజకవర్గంలో కీలక నేత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు.  కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఇందుప్రియ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ ..కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  ఇందుప్రియతో పాటు..పలువురు నేతలు కూడా కాంగ్రెస్లో చేరారు.