
ఉప్పల్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కమ్మ సంఘం నాయకులు తెలిపారు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఉప్పల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. కమ్మ సంఘం నాయకులు మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, గడ్డిపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఏ అవసరం వచ్చినా అందరినీ ఆదుకునే నాయకుడు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉప్పల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న ఆయన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కమ్మ సంఘం ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. బృందావన్ కాలనీలో నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది.