చైనా వాళ్లు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు

V6 Velugu Posted on Aug 19, 2021

ముక్కు సూటిగా మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లో హల్ చల్ చేసే బాలీవుడు నటి కంగనా రనౌత్..మళ్లీ తన ఉనికిని చాటుకుంది. లేటెస్టుగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని  చెప్పింది. చైనా తన ఇన్స్టా అకౌంట్ ను హ్యాక్ చేసిందని..తాలిబన్లపై తాను చేసిన పోస్టులు కూడా కనిపించడం లేదని తెలిపింది. ఉదయం చూసేసరికి తాలిబన్ల గురించి తాను పెట్టిన స్టోరీ కనిపించలేదని... ఆ తర్వాత గంటకి తన అకౌంట్ కూడా కన్పించకుండా పోయిందని తెలిపింది. వెంటనే ఇన్స్టా నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా తన అకౌంట్ యాక్టివేట్ అయిందని చెప్పారంది. ఇదంతా అంతర్జాతీయ కుట్రలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కంగనా.

Tagged kangana ranaut, Claims, Instagram Account , China Hacked

Latest Videos

Subscribe Now

More News