
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) ఇంట పండుగ వాతావరం నెలకొంది. త్వరలోనే ఆమె ఇంట్లో మరో బుల్లి రనౌత్ అడుగుపెట్టనుందట. దీంతో ఆ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కంగనా సోదరుడు అక్షత్ రనౌత్(Akshath Ranaut) త్వరలో తండ్రి కాబోతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే అక్షత్ రనౌత్ భార్య రీతూ రనౌత్(Reethu Ranaut) సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ ఆనందకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు కంగనా. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోస్ ను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. " మా వదిన రీతూ రనౌత్ సీమంతం వేడుకలో కొన్ని అద్భుతమైన క్షణాలను మీతో పంచుకుంటున్నాను. మా మనసులు ఎంతో సంతోషంతో నిండిపోయాయి. బేబీ రనౌత్ రాక కోసం మేమంతా చాలా ఎదురుచూస్తున్నాం" అంటూ రాసుకొచ్చింది కంగనా. ఇక ఈ ఫొటోస్ లో కంగనా పట్టు చీరలో, ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి చాలా అందంగా కనిపించారు. దీంతో ఈ ఫొటోస్ కాస్త క్షణాల్లో వైరల్ గా మారాయి.
ALSO READ:తమన్నా చేతికి ఖరీదైన డైమండ్ రింగ్.. ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ(Emergency) అనే సినిమాలో నటిస్తున్నారు. 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఎమర్జెన్సీ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు.
https://www.instagram.com/p/CvCjZohofWY/?utm_source=ig_web_copy_link